ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ స్వల్ప మార్పులు

September 02, 2021
img

తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో సల్పమార్పులు జరిగాయి. ఈ కౌన్సిలింగ్‌కు సంబంధించిన వెబ్ ఆప్షన్ పక్రియ వాయిదా పడింది. కళాశాలల గుర్తింపు ప్రక్రియ ఆలస్యం కావడంతో షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 4 నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభమై 13 తో ముగించాల్సి ఉంది. కానీ ఈ నెల 11 నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఈనెల 18న ఇంజనీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపులు జరగనున్నాయి. మరోవైపు ఈ నెల 4 నుంచి 11 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. 


Related Post