నేడు సూర్యాపేటలో మెగా జాబ్‌మేళా

July 28, 2021
img

సూర్యాపేట పట్టణంలో నేడు మెగా జాబ్‌మేళా జరుగుతోంది. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్థానిక వాణిజ్య భవన్‌లో జాబ్‌మేళా జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి మాధవ్ రెడ్డి తెలిపారు. ఈ జాబ్‌మేళాలో అనేక ప్రైవేట్ కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. వాటిల్లో వివిద ఉద్యోగాలకు పదో తరగతి, డిగ్రీ, ఐటిఐ చేసిన 18-35 ఏళ్ళలోపు వారు పాల్గొనవచ్చని తెలిపారు. జాబ్‌మేళాకు హాజరయ్యేవారు తప్పనిసరిగా తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు వాటి జిరాక్సు కాపీలు, పాస్‌పోర్ట్‌ సైజ్ ఫోటోలు, ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఈ జాబ్‌మేళాకు సంబందించి మరింత సమాచారం కొరకు 96768 68466,94419 93390 నెంబర్లలో తమను సంప్రదించవచ్చని మాధవ్ రెడ్డి తెలిపారు. 


Related Post