మోడల్ స్కూల్ టీచర్లకు కూడా పీఆర్సీ

July 28, 2021
img

రాష్ట్రంలో మోడల్ స్కూల్, ఆదర్శ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు కూడా తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీని వర్తింపజేయబోతోంది. దీనికి సంబందించి ఫైలుపై రాష్ట్ర ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సంతకం చేశారని నేడు దానిని విద్యాశాఖకు పంపిస్తారని రాష్ట్ర మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యాకమల్లు తెలిపారు. తమకు పీఆర్సీని వర్తింపజేస్తున్నందుకు ఆయన అసోసియేషన్ కార్యదర్శి నగేష్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌ తదితరులతో కలిసి వెళ్ళి ఆర్ధిక మంత్రి హరీష్‌రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. 


Related Post