ఆగస్టు 14న టీఎస్ఆర్‌జెసి సెట్‌ ప్రవేశపరీక్ష

July 27, 2021
img

తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కాలేజీలలో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఆర్‌జెసి సెట్‌ను ఆగస్టు 14న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించనున్నట్టు రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రమణ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో  గురుకులాల్లో ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసి ఆంగ్ల మాద్యమంలో ప్రవేశాల కోసం టీఎస్ ఆర్‌జెసి సెట్ నిర్వహిస్తారు. ఈ ప్రవేశపరీక్ష హాల్ టికెట్లు ఆగస్టు9 నుంచి http://tsrjdc.cgg.gov.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని రమణ కుమార్‌ తెలిపారు. 


Related Post