టి-ఎంసెట్ ప్రవేశ పరీక్షల రీషెడ్యూల్‌కు వెసులుబాటు

July 24, 2021
img

బిట్ శాట్, ఎంసెట్ రెండు ప్రవేశ పరీక్షలు వ్రాసే విద్యార్దులకు ఊరట కలిగిస్తూ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి విద్యార్దులు తమ ప్రవేశపరీక్షల తేదీలను మార్పు (రీషెడ్యూల్) చేసుకొనే అవకాశం కల్పించింది. 

ఆగస్ట్ 4 నుంచి 10వ తేదీ వరకు ఎంసెట్ ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. అయితే అదే సమయంలో బిట్ శాట్-2021 ప్రవేశ పరీక్ష కూడా జరగనుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దేశంలోనే గొప్ప విద్యా సంస్థగా పేరొందిన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) సీటు పొందవచ్చు. కనుక చాలా మంది విద్యార్దులు ఎంసెట్, బిట్‌ శాట్ రెండు ప్రవేశపరీక్షలు వ్రాస్తుంటారు. రెండు పరీక్షలు ఒకేరోజు జరుగుతుండటంతో విద్యార్థులు వాటిలో ఏదో ఒకటి వదులుకోవలసి వస్తోంది. కనుక వారు ఇదే విషయాన్ని ఉన్నత విద్యామండలి దృష్టికి తీసుకువెళ్ళి రెండు పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.   

వారి అభ్యర్ధన మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి రెండు ప్రవేశ  పరీక్షలు రాసే విద్యార్థులకు వెసులుబాటును కల్పించింది. ఆ ప్రకారం బిట్ శాట్ ప్రవేశపరీక్ష అనంతరం లేదా ముందుగా ఎంసెట్ పరీక్ష ప్రవేశపరీక్ష వ్రాసేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇందుకోసం విద్యార్థులు ముందుగా ప్రవేశ పరీక్షల రీషెడ్యూల్ కోసం convener.eamcet.@tsche.ac.in కు ఈ మెయిల్ ద్వారా తెలియజేసి తమ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ప్రకారం ఎంసెట్ ప్రవేశ పరీక్షల తేదీలను మార్చుకొని వ్రాయవచ్చు.

Related Post