హైదరాబాద్‌ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్‌గా బిజె.రావు

July 24, 2021
img

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయు) కొత్త వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ బి.జె. రావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. 

ప్రస్తుతం బీ.జే.రావు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఆర్)లో బయాలజీ విభాగానికి ప్రధానాచార్యులుగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. బి.జే.రావు పూర్తి పేరు బసత్కర్ జగదీశ్వర రావు. ఆయన 1984లో బెంగళూరు ఐఐఎస్‌, పిహెచ్‌డి చేశారు. ఆయన ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీ ఐఎఫ్ఆర్) 1996-2018 వరకు ప్రొఫెసర్‌గా సేవలందించారు. ఆ తర్వాత తిరుపతి ఐఐఈఆర్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ప్రస్తుత హెచ్‌సీయు వైస్ ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ పి.అప్పారావు నుంచి బీ.జే.రావు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.


Related Post