మహేశ్వరంలో నేడు జాబ్‌ ఫెయిర్

July 20, 2021
img

హైదరాబాద్ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఈరోజు జాబ్‌ ఫెయిర్ నిర్వహిస్తోంది. ఈరోజు ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు హైదరాబాద్‌లోని మహేశ్వరం మండలం ఎంపిడిఓ కార్యాలయంలో ఈ జాబ్‌మేళా ఫెయిర్ జరుగుతుంది. నగరంలో గల పలు ప్రైవేట్ సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసుకొనేందుకు నేడు జరుగుతున్న ఈ ఈ జాబ్‌ ఫెయిర్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.

విద్యార్హతలు: పదవ తరగతి, ఐ.టి.ఐ, ఇంటర్, డిగ్రీ, బీటెక్. 

వయోపరిమితి : 19 ఏళ్ల నుండి 30 ఏళ్ల లోపు వారు.

వేతనం: నెలకు రూ. 10,000 నుంచి 20,000 వరకు

ఈ జాబ్ ఫెయిర్‌కు హాజరయ్యే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు, వాటి జిరాక్స్ కాపీలు, పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోలు వెంట తెచ్చుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ఈ జాబ్ ఫెయిర్‌కు సంబందించి పూర్తి వివరాలను మొబైల్ నెంబర్ :99636 66221 ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.

Related Post