త్వరలో తెలంగాణలో విద్యాసంవత్సరం ప్రారంభం

June 10, 2021
img

తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో వచ్చే వారం నుండి 2021-2022 విద్యా సంవత్సరాన్ని  ప్రారంభించేందుకు రాష్ట్ర విద్యాశాఖ ప్రణాళికలను సిద్ధం చేసింది. అయితే ఇంకా పాఠశాలలు, కాలేజీలు తెరిచి ప్రత్యక్ష పద్దతిలో తరగతులు నిర్వహించలేనందున ఈ నెల 16 నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మొదట 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు మాత్రమే ఆన్‌లైన్‌ క్లాసులు జరగనున్నాయి. వచ్చే నెలలో కరోనా పరిస్థితులను సమీక్షించి వీలైతే రోజు విడిచి రోజు పాఠశాలలను, కాలేజీలను నడిపించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. 


Related Post