ఎంసెట్ పరీక్షలు కూడా వాయిదా?

June 10, 2021
img

జూన్‌ 5 నుంచి 9వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు జరుగవలసి ఉంది. అంటే మరో మూడు వారాలలో ఆ ప్రవేశ పరీక్షలు జరుగుతాయన్న మాట. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు రద్దు చేసినందున విద్యార్దులకు మొదటి సంవత్సరం రికార్డుల ఆధారంగా ఫలితాలు ప్రకటించాలనుకొంటున్నామని, త్వరలోనే అధికారులతో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకొంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిన్ననే చెప్పారు. కనుక ఇంటర్ పూర్తి చేసిన విద్యార్దులకు ఎంసెట్ ప్రవేశ పరీక్షలకు సిద్దమయ్యేందుకు అట్టే సమయం కూడా ఉండదు. పైగా రాష్ట్రంలో ఇంకా కరోనా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. విద్యార్ధులెవరికీ టీకాలు వేయలేదు. కనుక ఎంసెట్ పరీక్షలు వాయిదా వేయక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంసెట్ పరీక్షల నిర్వహణ, వాయిదాపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చునని, ప్రభుత్వాదేశాల ప్రకారం కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి అధికారులు చెపుతున్నారు. 


Related Post