త్వరలో పదో తరగతి గ్రేడ్స్ ప్రకటన

May 12, 2021
img

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ పదవ తరగతి విద్యార్థులకు తీపి కబురు అందించింది. రాష్ట్రంలో కరోనా కారణంగా పదోతరగతి వార్షిక పరీక్షలను రద్దు చేసి విద్యార్దులందరినీ పైతరగతులకు ప్రమోట్ చేస్తునట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పదో తరగతి విద్యార్దుల ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్ఏ) మార్కుల ఆధారంగా గ్రేడులను త్వరలో ప్రకటించనుంది. ఇందుకు సంబంధించి విద్యా శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఫలితాల పట్ల విద్యార్దులెవరికైనా అసంతృప్తి ఉంటే కరోనా ఉదృతి తగ్గిన తరువాత పరీక్షలు వ్రాసేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.

రాష్ట్ర సిలబస్‌ కలిగిన ప్రభుత్వ, జిల్లా పరిషత్, ప్రైవేటు, ఎయిడెడ్‌ తదితర అన్ని యాజమాన్యాలలోని పాఠశాలల పదో తరగతి విద్యార్థులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొన్నారు. పదో తరగతి ఫలితాలకు (హిందీ మినహా) గ్రేడింగ్ విదానం ఈవిదంగా ఉంటుంది: 

గ్రేడ్

మార్కులు

జీపీఏ

-1

91-100

10

-2

81-90

9

బి-1

71-80

8

బి-2

61-70

7

సి-1

51-60

6

సి-2

41-50

5

డి

35-40

4

Related Post