ఇంటర్, డిగ్రీ ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్‌ జారీ

May 02, 2021
img

తెలంగాణ వెనుకబడిన వర్గాల విద్యార్థుల సంక్షేమ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి సెట్  నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే ఇంటర్(బాలురు, బాలికలు), డిగ్రీ(విద్యార్థినిలు మాత్రమే)  జూనియర్ కళాశాల మరియు రెసిడెన్షియల్, డిగ్రీ కళాశాలప్రవేశపరీక్షగా సెట్ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.

జూనియర్ ఇంటర్ లో చేరుటకు అర్హత: పదవ తరగతి పూర్తయిన బాలబాలికలు,

కళాశాలలో ఆఫర్ చేస్తున్న కోర్సులు: ఎంపీసీ, బైపిసి, సిఈసి, ఎంఈసి

డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలో ప్రవేశాలకు అర్హత: ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిలు.  

ఆఫర్ చేస్తున్న కోర్సులు: బీఎస్సీ (ఎంపీసీ, బిజెడ్‌సి, ఎంపీపీఎస్, ఎంఎస్‌పిఎస్), బీకాం(జనరల్, కంప్యూటర్స్, బిజినెస్ అనలిటిక్స్), బిఏ( హెచ్ఈసి, హెచ్ఈపి)

దరఖాస్తుల ఫీజు: రూ. 200/-

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ : ఏప్రిల్ 23 నుంచి

  దరఖాస్తుల సమర్పించుటకు చివరి తేదీ: మే 31

 హాల్ టికెట్ డౌన్‌లోడ్‌: జూన్ 4

 సెట్ పరీక్ష ప్రవేశపరీక్ష: జూన్ 13

 మరిన్ని వివరాల కోసం www.miptbcwries.telangana.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. సంప్రదించవలసిన ఫోన్ నెంబరు:040-2328266. 

Related Post