అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

April 23, 2021
img
ఐసీడీఎస్, హైదరాబాద్‌లోని మహిళ, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల విభాగంలో 42 అంగన్వాడి టీచర్ల పోస్టుల భర్తీకై అర్హులైన వారి నుండి దరఖాస్తులను ఆహ్వానించింది.
అంగన్వాడి టీచర్ల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తారు. మే 16 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. కనీసం పదవ తరగతి పాసైన మహిళలు మాత్రమే వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎలాంటి పరీక్ష ఉండదు. వయోపరిమితి 21 సంవత్సరాల నుండి 35గా నిర్ణయించారు. దరఖాస్తులులో తప్పనిసరిగా వయసు, కులం, విద్య అర్హత వంటి ధ్రువపత్రాలను కూడా అప్‌లోడ్ చేయాలి. వాటిని మే 26న పరిశీలించిన తరువాత అర్హులైన అభ్యర్ధులను ఎంపిక చేస్తారు ఈ ఉద్యోగాలకు సంబందించి మరిన్ని వివరాలకు https://wdcw.tg.nic.in/  అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు.

Related Post