టిఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ

April 21, 2021
img

తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త! ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలలో గల 127 పోస్టుల భర్తీకి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ స్థానంలో టిఎస్‌పీఎస్సీ మళ్ళీ కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున, వారికి కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనేందుకు వీలుకల్పిస్తూ టిఎస్‌పీఎస్సీ మళ్ళీ తాజాగా నోటిఫికేషన్‌ ఇచ్చింది. అయితే పోస్టులు, వాటి సంఖ్యలో ఎటువంటి మార్పులు ఉండవు. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనేందుకు ఏప్రిల్ 19 నుండి మే 20వ తేదీ వరకు గడువు ఉంది. గతంలో దరఖాస్తు చేసుకొన్నవారు మళ్ళీ తమ వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబందించి పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్ సందర్శించవచ్చు. 

పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో ఖాళీలు: 

సీనియర్ అసిస్టెంట్-15 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్- 10 పోస్టులు 

జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఖాళీలు: 

జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ -102 పోస్టులు 

విద్యార్హతలు: డిగ్రీ+డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ 

లేదా 

బీసీఏ డిగ్రీ+టైప్‌రైటింగ్ ఇంగ్లీష్ లోయర్ గ్రేడ్ 

లేదా 

కంప్యూటర్ సైన్స్ డిగ్రీ పాస్ అయ్యుండాలి. 

వయస్సు: 18 నుంచి 34 ఏళ్ళ లోపు

పరీక్ష ఫీజు: రూ.200

ఎంపిక విధానం: రాతపరీక్ష

పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్.

Related Post