యూజీసీ నేషనల్ ఎబిలిటీ టెస్ట్ (నెట్ )పరీక్షలు వాయిదా

April 21, 2021
img

కరోనా వైరస్ నేపథ్యంలో యూజీసీ నేషనల్ ఎబిలిటీ టెస్ట్ (నెట్ )పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిన్న తెలియజేశారు.

మే 2 నుండి 17వ తేదీ వరకు నెట్ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు  పెరుగుతుండడంతో నెట్ వాయిదా పడింది. విద్యార్థుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని పోక్రియాల్ తెలిపారు. గత డిసెంబర్ పరీక్షల షెడ్యూల్‌ను మే 20-21కి వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి తెలిపారు.


Related Post