జేఈఈ-మెయిన్స్ పరీక్షలు వాయిదా

April 19, 2021
img

దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత పెరిగినందున ఈనెల 27 నుంచి 30 వరకు జరుగవలసిన జేఈఈ-మెయిన్స్ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖామంత్రి రమేశ్ పోఖ్రియాల్ ప్రకటించారు. మళ్ళీ ఎప్పుడు పరీక్షలు నిర్వహించేది 15 రోజుల ముందుగానే ప్రకటిస్తామని తెలిపారు. పరీక్షలు వాయిదా పడినందున విద్యార్దులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని ‘ఎన్‌టీఎ అభ్యాస్’ మొబైల్ యాప్‌ ద్వారా పరీక్షలకు మరింత సన్నదం కావాలని సూచించారు. 

ఫిబ్, మార్చి నెలల్లో రెండు విడతలుగా జేఈఈ-మెయిన్స్ పరీక్షలు జరిగాయి. కానీ కరోనా కారణంగా ఈ నెల 27-30 తేదీలలో జరుగవలసిన మూడవ విడత పరీక్షలు వాయిదా వేయక తప్పలేదు.     


Related Post