ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి శుభవార్త

April 19, 2021
img

తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి ఓ శుభవార్త. మంగళవారం వారి  బ్యాంక్ ఖాతాలలో ప్రభుత్వం రూ.2,000 చొప్పున ఆర్ధికసాయం జమా చేయనుంది. బుదవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాలలో ఒక్కో ఉపాధ్యాయునికి 25 కేజీలు బియ్యం ఉచితంగా అందజేయనుంది. 

కరోనా కారణంగా రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు మళ్ళీ మూతపడటంతో రోడ్డున పడ్డవారికి తాత్కాలికంగా ఈ సాయం అందజేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికోసం ఇప్పటివరకు2,06,345 మంది ఉపాధ్యాయులు, 52,820 మంది భోధనేతర సిబ్బంది దరఖాస్తు చేసుకోగా వారిలో 1,06,383 మంది ఉపాధ్యాయులు, 11,621 మంది సిబ్బందికి అర్హులుగా గుర్తించారు. వారందరికీ ఈ ఆర్ధికసాయం అందజేసేందుకు ప్రభుత్వం రూ.32 కోట్లు విడుదల చేసింది. పౌరసరఫరాల శాఖ 3,625 టన్నుల బియ్యాన్ని సిద్దం చేసింది. రేపటి నుంచి మూడు రోజులలోగా లబ్దిదారులందరి బ్యాంక్ ఖాతాలలో రూ.2,000 చొప్పున జమా అవుతుంది. మంగళవారం నుంచి వచ్చే ఆదివారం లోగా అందరికీ బియ్యం పంపిణీ కార్యక్రమం కూడా పూర్తిచేయనున్నారు. ఈ తాత్కాలిక పధకానికి అర్హులైనవారి పేర్లను https://schooledu.telangana.gov.in లో ఉంచారు. 

Related Post