హైదరాబాద్‌లో జాబ్‌మేళా...పోలీసుల చొరవ శభాష్!

April 16, 2021
img

శనివారం హైదరాబాద్‌లో పలు ప్రైవేట్ కంపెనీల ఆధ్వర్యంలో జాబ్‌మేళా జరుగనుంది. దీని కోసం హైదరాబాద్‌ నగర పోలీసులు చొరవ తీసుకొని ఫలక్‌నుమా ఏసీపీ పరిధిలో ప్రచారం చేస్తూ నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులు స్వీకరిస్తుండటం అభినందనీయం. 

ఛత్రినాక ఇన్‌స్పెక్టర్‌ సయ్యద్‌ ఖాదర్‌ జిలానీ మీడియాతో మాట్లాడుతూ, “రేపు భరత్‌కోట వద్దగల ఫలక్‌నుమా జూనియర్‌ కళాశాల ఆవరణలో ప్రైవేట్ కంపెనీలు జాబ్‌మేళా నిర్వహించబోతున్నాయి. ఈ జాబ్‌మేళాలో పదో తరగతి నుంచి డిగ్రీవరకు విద్యార్హతలు కలిగినవారికి తగిన ఉద్యోగావకాశాలుంటాయి. కనుక మేము ఫలక్‌నుమా ఏసీపీ పరిధిలో తిరుగుతూ ఈ విషయం నిరుద్యోగ యువతకు తెలియజేసి, దరఖాస్తులు స్వీకరిస్తున్నాము,” అని చెప్పారు. 

రేపు ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఫలక్‌నుమా జూనియర్‌ కళాశాల ఆవరణలో జాబ్‌మేళా జరుగుతుంది. ఆసక్తి కలిగినవారు ఈరోజు తమ బస్తీలో తిరుగుతున్న పోలీస్ వాహనాలలో పోలీసులకు అందజేయవచ్చు లేదా రేపు నేరుగా జాబ్‌మేళాలో నిర్వాహకులకు సమర్పించవచ్చు. జాబ్‌మేళాకు సంబందించి మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబరు 8686 100 201. 

Related Post