ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల వాయిదా

April 05, 2021
img

తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు శనివారం  వెల్లడించింది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఈనెల 7వ తేదీన జరగాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు బోర్డు తెలిపింది. అయితే మే1 నుండి మే 20వ తేదీ వరకు జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలు మాత్రం యధావిధిగా ఉంటాయని బోర్డు స్పష్టం చేసింది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మే 29 నుంచి జూన్ 7 వరకు నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. ఇప్పటికే  హాల్ టికెట్ల జారీ ప్రక్రియ కొనసాగుతుందని బోర్డు తెలిపింది. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.in నుంచి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 


Related Post