తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్‌ జారీ

April 03, 2021
img

తెలంగాణ ఉన్నత విద్యామండలి శనివారం ఐసెట్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2021-22 విద్యా సంవత్సరానికి గాను ఎంసీఏ, ఎంబీఏ సీట్ల భర్తీకి ఐసెట్ ఎంట్రెన్స్ పరీక్షల కొరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు.

అర్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన  యూనివర్సిటీ డిగ్రీ పట్టా,

ఫీజుల వివరాలు: జనరల్ అభ్యర్థులకు రూ.650, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 450గా ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.  రూ.250 ఆలస్య రుసుముతో జూన్‌ 30 వరకు, రూ. 1,000తో జూలై 15 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు.

ముఖ్యమైన తేదీలు: 

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ: ఏప్రిల్ 7 నుంచి 

 అదనపు రుసుము లేకుండా దరఖాస్తులకు  చివరి తేదీ: జూన్ 15

 ఐసెట్ ఎంట్రన్స్ పరీక్ష: ఆగస్టు నెలలో

 ఐసెట్ ఎంట్రెన్స్ పరీక్ష ఫలితాలు : సెప్టెంబర్ నెలలో

దీనికి సంబందించి పూర్తి వివరాల కొరకు https://tsicet.nic.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

Related Post