టిఎస్‌పీఎస్సీ తాత్కాలిక ఛైర్మన్‌గా సాయిలు నియామకం

March 31, 2021
img

టిఎస్‌పీఎస్సీ తాత్కాలిక ఛైర్మన్‌గా సీహెచ్ సాయిలును నియమిస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం టిఎస్‌పీఎస్సీకి తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న కృష్ణారెడ్డికి ఈనెల 18న పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో సాయిలును నియమితులయ్యారు. త్వరలో 50,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం సాయిలును కూడా శాశ్విత ప్రాతిపదికన కాకుండా తాత్కాలిక ఛైర్మన్‌గానే నియమించడం విశేషం. ఈరోజు బాధ్యతలు స్వీకరించిన సాయిలు పూర్తిస్థాయి ఛైర్మన్‌ నియమిత్ఝులయ్యే వరకు లేదా ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. 


Related Post