ఏప్రిల్ 1 నుంచి ఇంటర్ పరీక్షలు

March 27, 2021
img

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కారణంగా అన్ని విద్యాసంస్థలను మూసివేసిన సంగతి తెలిసిందే. కానీ ఇంటర్ పరీక్షలు యధాతధంగా నిర్వహించబోతున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. పరీక్షలు వ్రాయకుండా పాస్ చేసినట్లయితే విద్యార్దుల భవిష్యత్‌పై ప్రభావం పడుతుంది కనుక తప్పనిసరిగా పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణులవడం చాలా ముఖ్యమని భావించినందునే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. విద్యార్దులకు కరోనా సోకకుండా పరీక్షా కేంద్రాలలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు అధికారులు తెలిపారు. ఒకటి రెండు రోజులలో హాల్ టికెట్స్ విడుదల చేస్తామని తెలిపారు. 

ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్దులకు ఏప్రిల్ 1,3వ తేదీలలో పర్యావరణం, నైతిక విలువలకు సంబందించిన సబ్జెక్ట్స్ పై అసైన్‌మెంట్ రూపంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఏప్రిల్ 7వ తేదీ నుంచి జరిగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను మాత్రం కొన్ని రోజులు వాయిదా వేయబోతున్నట్లు సమాచారం. 

Related Post