టెక్ మహీంద్రలో యువతకు ఉచిత శిక్షణ

March 26, 2021
img

హైదరాబాద్‌, టెక్ మహీంద్ర ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఎంఎస్ ఆఫీస్,  స్పోకెన్ ఇంగ్లీష్,  టైపింగ్, రిటైల్ సేల్స్ తదితర కోర్సులలో ఉచిత వృత్తి నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్‌లతో పాటు,  జిరాక్స్ కాపీలు, 4 ఫోటోలు వెంట తీసుకురావాలని  సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఉచిత శిక్షణ  కాలపరిమితి : మూడు నెలలు,

వయోపరిమితి: 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల వరకు,

 పేర్ల నమోదుకు చివరి తేదీ : మార్చి 31 

అర్హతలు : పదవ తరగతి,  డిప్లమా,  డిగ్రీ, పీజీ చదివిన విద్యార్థులు,

 మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్: 91000 56583, 88855 12037.


Related Post