నేటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ బంద్‌

March 25, 2021
img

రాష్ట్రంలో కరోనా తీవ్రత మళ్ళీ పెరుగుతున్నందున అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉస్మానియా యూనివర్సిటీ కూడా నేటి నుంచి కొన్ని రోజులు మూసివేస్తున్నట్లు చీఫ్ వార్డెన్ డాక్టర్ కె.శ్రీనివాస్ ప్రకటించారు. ఈరోజు మధ్యాహ్నం భోజనాల తరువాత యూనివర్సిటీలోని అన్ని హాస్టల్స్ ను మూసివేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలువురు విద్యార్దులు హాస్టల్స్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మిగిలినవారు కూడా నేడు ఇళ్ళకు వెళ్ళిపోయేందుకు సిద్దం అవుతున్నారు. తరగతులు నిలిపివేసి, హాస్టల్స్ మూసివేసినందున డిగ్రీ, పీజీ పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు మళ్ళీ యూనివర్సిటీని ఎప్పుడు తెరుస్తామో విద్యార్దులకు తెలియజేస్తామని చెప్పారు.  


Related Post