తెలంగాణ ఏర్పడిన తరువాత 1,26,641 ఉద్యోగాలు భర్తీ

February 25, 2021
img

తెలంగాణలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాలలో మార్చి 14న ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు జరుగబోతుండటంతో ప్రతిపక్షాలు రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి హామీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నాయి. ఉద్యోగాల భర్తీ విషయంలో టిఆర్ఎస్‌ ప్రభుత్వం చెపుతున్నవన్నీ కాకిలెక్కలేనని కొట్టిపారేస్తున్నాయి. టిఆర్ఎస్‌ మళ్ళీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళవుతున్నా ఇంతవరకు నిరుద్యోగ భృతి హామీని అమలుచేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే సిఎం కేసీఆర్‌ మళ్ళీ ఇప్పుడు 50,000 ఉద్యోగాల భర్తీ అంటూ కొత్త కధ చెపుతున్నారని ఆరోపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్‌, బిజెపి నేతలు ఈ అంశాలపై బహిరంగచర్చకు రావాలంటూ టిఆర్ఎస్‌ నేతలకు సవాళ్ళు కూడా విసురుతున్నారు. 

ఈ నేపధ్యంలో టిఆర్ఎస్‌ అధికారిక పత్రికగా భావించబడుతున్న ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నోటిఫికేషన్లు జారీ చేసిందో... వాటిలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో తదితర వివరాలను ప్రచురించింది. త్వరలో జారీ చేయబోయే నోటిఫికేషన్‌ ద్వారా మరో 50,000 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు నమస్తే తెలంగాణ పేర్కొంది. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు జారీ చేసిన నోటిఫికేషన్లు, నియామకాలు

ఏజన్సీ పేరు

నియామకాలకు అనుమతి

జారీ చేసిన నోటిఫికేషన్స్

భర్తీ చేసిన ఉద్యోగాలు

వివిద దశలలో ఉన్నవి

టిఎస్‌పీఎస్సీ

39,952

36,581

30,594

9,358

టిఎస్ పోలీస్

31,972

31,972

31,972

-

గురుకుల బోర్డు

7,016

3,678

3,623

3,393

ఎంహెచ్ ఎస్‌ఆర్‌బీ

1,466

-

-

1,466

డిపార్ట్మెంటల్ సెలెక్షన్ కమిటీ

16,656

11,494

11,278

5,378

ఇతర పద్దతులలో

53,264

49,174

49,174

4,090

మొత్తం

1,50,326

1,32,899

1,26,641

23,685

(నమస్తే తెలంగాణ పత్రిక సౌజన్యంతో)

Related Post