ఉద్యోగ కల్పనలో కూడా హైదరాబాద్‌ నెంబర్: 1

February 25, 2021
img

గతంలో ఉద్యోగాల కోసం యువత ముంబై, పూణే, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా వంటి నగరాలకు వెళ్ళేవారు కానీ తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అత్యుత్తమైన విధానాలతో హైదరాబాద్‌ నగరానికి అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తరలివస్తున్నాయి. హైదరాబాద్‌లో వేలకోట్లు పెట్టుబడితో అనేక సంస్థలు, పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. దీంతో ఇప్పుడు ఉద్యోగకల్పనలో కూడా హైదరాబాద్‌ నెంబర్:1 స్థానంలో నిలిచింది. దీంతో ఇప్పుడు ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల నుంచే యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్‌ వస్తున్నారు.   

ఇటీవల వి-బాక్స్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా నేషనల్ ఎంప్లాయ్ ఎబిలిటీ టెస్ట్-2021 నిర్వహించాయి. దేశవ్యాప్తంగా 65 మంది విద్యార్థుల అభిప్రాయాలు, 15 పరిశ్రమలు, 150 పైగా కార్పోరేట్ సంస్థల అభిప్రాయాలను తీసుకుని ఓ నివేదికను తయారు చేశాయి. ఈ సర్వేలో పాల్గొన్నవారు హైదరాబాద్‌కే మొగ్గు చూపినట్లు నివేదికలో పేర్కొంది. ఇండియన్ స్కిల్స్ రిపోర్ట్-2021 ప్రకారం ఉద్యోగకల్పనలో దేశంలో హైదరాబాద్‌ నగరం నెంబర్: 1 స్థానంలో నిలువగా ఆ తర్వాతి స్థానాలలో బెంగళూరు, పూణే, ఢిల్లీ  నిలిచాయి. దేశవ్యాప్తంగా ‘క్రిటికల్ థింకింగ్‌’లో తెలంగాణ విద్యార్థులు నాలుగో స్థానంలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. తెలంగాణ విద్యార్థులు ‘ఇంగ్లీష్ స్కిల్స్’ లో ఐదో స్థానంలో ఉన్నారని పేర్కొంది.

Related Post