రేపటి నుంచి 6, 7,8 తరగతులు షురూ

February 23, 2021
img

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ లో బుదవారం నుంచి 6,7,8 తరగతులు కూడా ప్రారంభించబోతునట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అయితే స్కూల్స్‌లో అవసరమైన ఏర్పాట్లు చేసుకొని తరగతులు ప్రారంభించేందుకు రేపటి నుంచి మార్చి 1వ తేదీ వరకు సమయం ఇచ్చామని మంత్రి తెలిపారు. తరగతులకు హాజరయ్యే విద్యార్దులకు తల్లితండ్రులు అనుమతి పత్రం తప్పనిసరి అని చెప్పారు. ఉపాధ్యాయులు, స్కూలు సిబ్బంది, విద్యార్దులు అందరూ తప్పనిసరిగా కరోనా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుందని చెప్పారు. 

ఈనెల 1వ తేదీ నుంచి 9,10, ఇంటర్మీడియెట్ విద్యార్దులకు ప్రత్యక్షపద్దతిలో తరగతులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. వాటిలో ఎటువంటి సమస్యలు లేకుండా సజావుగా సాగుతుండటంతో అదేవిదంగా దిగువ తరగతులను కూడా ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది.   


Related Post