కాగ్నిజెంట్ ఇండియాలో భారీగా ఉద్యోగ నియామకాలు

February 19, 2021
img

ప్రముఖ ఐటి సంస్థ కాగ్నిజెంట్‌లో ఈ ఏడాది భారీగా ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్లు ఆ సంస్థ ఇండియా సియండి రాజేష్ నంబియార్ తెలిపారు. కాగ్నిజెంట్ చరిత్రలోనే సరికొత్త రికార్డుగా నిలిచిపోయే విదంగా ఈ ఏడాదిలో 23,000 ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నామని తెలిపారు. గత సంవత్సరం క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా సుమారు 17,000 కొత్త విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. గడిచిన 18 నెలలు కాగ్నిజెంట్‌లో 1.3 లక్షల మంది ఉద్యోగులకు డిజిటల్ రంగంలో శిక్షణ ఇచ్చామని తెలిపారు. అత్యంత ప్రతిభావంతులైన ఇంజనీరింగ్, సైన్స్, మేనేజ్ మెంట్ విద్యార్థులను ఎంపిక చేయనున్నామని రాజేష్ నంబియార్ తెలిపారు. 

ప్రస్తుతం కాగ్నిజెంట్ ఇండియాలో 2.4 లక్షలమంది ఉద్యోగులు ఉన్నారు. కాగ్నిజెంట్‌లో ఇంటర్న్షిప్‌కు కూడా చాలా  ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులను ఉద్యోగ నియామకాలు చేపట్టడంలో కాగ్నిజెంట్ ముందున్నదని సిఎండి రాజేష్ నంబియార్ అన్నారు.

Related Post