సంగారెడ్డి మహిళా శిశు సంక్షేమశాఖ ఉద్యోగ ప్రకటన

January 21, 2021
img

సంగారెడ్డి జిల్లాలో మహిళ, శిశు సంక్షేమ శాఖలో పలు ఉద్యోగాలకు ఒప్పంద ప్రాతిపదికన (అవుట్ సోర్సింగ్) భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది.

ఉద్యోగ వివరాలు: 

మేనేజర్-ఒక పోస్టు.( స్త్రీ, పురుషులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు). 

జీతం: నెలకు రూ. 17,500/-

విద్యార్హతలు: ఎమ్మెస్ డబ్ల్యూ, ఎమ్మెస్సీ హోమ్ సైన్స్, పీజీ ఇన్ సైకాలజీ, మూడేళ్లు అనుభవం కలిగి ఉండాలి. 

వయో పరిమితి: 25-35 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బిసి, దివ్యాంగులకు 40 సంవత్సరాలు.

ఆయా: ఒక పోస్టు (స్త్రీలు మాత్రమే అర్హులు)

జీతం: నెలకు రూ. 6,000/- 

వయో పరిమితి: 25-50 సంవత్సరాలు. ఉద్యోగానుభవం కలిగినవారికి ప్రాధాన్యత. 

చౌకీదార్: ఒక పోస్టు (స్త్రీలు మాత్రమే అర్హులు).

జీతం: నెలకు రూ.6,000/-

వయో పరిమితి: 25-50 సంవత్సరాల వరకు

 అవుట్ రిసెర్చ్ వర్కర్: ఒక పోస్ట్

 జీతం : నెలకు రూ. 8,000/- (పురుషులు, స్త్రీలు కూడా అర్హులు)

వయోపరిమితి: 25-30 సంవత్సరాల వరకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40 సంవత్సరాలు.

విద్యార్హతలు: బ్యాచిలర్ డిగ్రీతో పాటు సోషల్ వర్క్ లో మూడేళ్ళ అనుభవం కలిగి ఉండాలి. 

దరఖాస్తుల ప్రారంభం తేదీ: 21/1/2021

దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేది:27/1/2021

ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను సంగారెడ్డి జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో ఉన్న మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలి. వీటికి సంబందించి మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు: 94433 0878, 80086 3425. 

Related Post