నేడు ఆన్‌లైన్‌ జాబ్ మేళా

January 20, 2021
img

రాష్ట్రంలో... ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో గత కొన్నేళ్ళుగా అనేక చిన్నా పెద్ద ప్రైవేట్ కంపెనీలు ఏర్పాటవుతుండటంతో వాటితో అనేక ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. వాటిలో వివిద ఉద్యోగాలను భర్తీ చేసేందుకు  రాష్ట్ర ఎంప్లాయి‌మెంట్‌ ఎక్స్ఛేంజి బుదవారం ఆన్‌లైన్‌లో జాబ్ మేళా నిర్వహించబోతోంది. దానిలో పాల్గొనేందుకుగాను అభ్యర్ధులు https://www.ncs.gov.in/ వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని మోడల్‌ కెరి‌యర్‌ సెంటర్‌ ఉన్నతాధికారి టి.రాములు తెలియజేశారు. వివిద కంపెనీల ప్రతినిధులు అభ్యర్ధుల అర్హతలను బట్టి ఎంపిక చేసుకొని ఆన్‌లైన్‌లోనే ఇంటర్వ్యూ చేస్తారని తెలిపారు. ఈ జాబ్ మేళా పూర్తికాగానే ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధులను ప్రకటిస్తారని తెలిపారు. ఈ జాబ్ మేళాకు సంబందించి వివరాల కొరకు సమన్వయకర్త రఘుపతిని 82476 56356 నెంబరులో సంప్రదించవచ్చని రాములు తెలిపారు.      


Related Post