తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

May 23, 2020
img

తెలంగాణ ఉన్నత విద్యాశాఖ అధికారుల సమక్షంలో విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఎంసెట్, ఈసెట్, లాసెట్ తదితర ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ప్రకటించారు. జూలై 1 నుంచి 9వరకు ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. కరోనా నేపధ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొంటూ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సబితారెడ్డి చెప్పారు. 

పరీక్షల తేదీలు: 

జులై 1: పాలీసెట్‌

జులై 1 నుంచి 3 వరకు: పీజీ సెట్

జులై 4: ఈసెట్

జులై 6 నుంచి 9 వరకు: ఎంసెట్

జులై 10: లాసెట్, లాపీజీ సెట్

జులై 13: ఐసెట్, 

జూలై 15: ఎడ్‌సెట్ 

Related Post