హైదరాబాద్‌లో రద్దయిన నోట్ల మార్పిడి?

May 13, 2025
img

హైదరాబాద్‌లో రద్దయిన పాత నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను బేగంపేట పోలీసులు అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి రూ.99 లక్షల విలువైన నోట్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో టివోలీ ఎక్స్‌ట్రీమ్ థియేటర్‌కి వద్ద శనివారం మద్యాహ్నం ఈ నోట్ల మార్పిడి జరుగుతున్నట్లు సమాచారం అందడంతో బేగంపేట సీఐ శ్రీధర్ వెంటనే పోలీసులను వెంటబెట్టుకొని వెళ్ళి వారిని అరెస్ట్‌ చేశారు.

రద్దయిన రూ.1,000, రూ.500 నోట్లతో పాటు కారు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రద్దయిన నోట్లని 20 శాతం కమీషన్‌తో మార్పిడికి ప్రయత్నిస్తున్నట్లు కనుగొన్నారు.            

వారు నలుగురూ మహబూబ్ నగర్‌ జిల్లా వేపూర్ గ్రామానికి చెందిన బుర్రా శివకుమార్, పుట్టపల్లి, రవీందర్ రెడ్డి, మల్లేశ్వర్, గొల్లమందల రవి అని పోలీసులు గుర్తించారు. మరో నలుగురు నిందితులు పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Related Post