ట్రంప్ సుంకాల దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఆ దెబ్బకి నేటికీ తేరుకోలేకపోతున్నాయి. ఇప్పుడు భారత్, పాక్ మద్య యుద్ధ వాతావరణం ఏర్పడటంతో ఇరుదేశాలలో స్టాక్ మార్కెట్స్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. అయితే పాక్ మార్కెట్‌తో పోలిస్తే భారత్ స్టాక్ మార్కెట్‌లో కాస్త నిలకడగానే ఉందని చెప్పాలి.
ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా భారత్ స్టాక్ మార్కెట్ ఈ రోజు ఉదయం (నిఫ్టీ) మైనస్ 100 పాయింట్స్ వరకు పడిపోయి మళ్ళీ పుంజుకొని మద్యాహ్నం 2 గంటలకు మైనస్ 10-15 పాయింట్స్- 24,368 వద్ద ఉండగా, సెన్సెక్స్ మైనస్ 52 పాయింట్స్- 80,589 వద్ద ఉంది. కనుక అన్ని రంగాలలో అన్ని సంస్థలు స్వల్ప నష్టాలలో కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ దెబ్బకి పాక్ స్టాక్ కేఎస్ఈ-100 ఏకంగా 6,272 పాయింట్స్ పడిపోయింది.
ఒకవేళ పాక్ ప్రతీకార దాడికి దిగితే భారత్-పాక్ మద్య యుద్ధం మొదలవుతుంది. కనుక అప్పుడు ఇరు దేశాల స్టాక్ మార్కెట్స్ కుప్పకూలిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది.
కనుక కొత్తగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకొంటున్నవారు, స్టాక్ మార్కెట్స్ గురించి అవగాహన లేనివారు కొంతకాలం దూరంగా ఉండటమే మంచిది. లేకుంటే కష్టార్జితం అంతా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది.
కానీ ఇప్పుడే అత్యంత విలువైన స్టాక్స్ అతి తక్కువ ధరకు లభించే అవకాశం కూడా ఉంటుంది. కనుక తెలివిగా మదుపు చేయగలిగేవారికి ఇదీ ఓ గొప్ప అవకాశమే.