తెలంగాణలో తైవాన్ టెలికాం కంపెనీ 300 కోట్లు పెట్టుబడి

May 04, 2025
img

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. తైవాన్‌కు చెందిన సిరా నెట్‌వర్క్, తెలంగాణకు చెందిన ఎల్‌సీజీసీరిజల్యూట్ గ్రూప్ కలిసి రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నాయి. ఈ రెండు సంస్థలు కలిసి ఫ్యూచర్ సిటీలో 10 ఎకరాల విస్తీర్ణంలో టెలికాం ఇండస్ట్రీకి అవసరమైన 5జీ సర్వర్లు, ఇతర పరికరాలు తయారుచేసే పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నాయి. దీని ద్వారా ప్రత్యక్షంగా 2500 మందికి ఉద్యోగాలు లాభిస్తాయని ఐటి మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు చెప్పారు. 

మంత్రి శ్రీధర్ బాబు కార్యాలయంలో సిరా నెట్‌వర్క్ ప్రతినిధులు చుయాన్, డౌగీయాస్, జాయ్ భట్టాచార్య, ఎల్‌సీజీసీరిజల్యూట్ గ్రూప్ సీఈవో మధుసూధన్, రణవీందర్ సింగ్, గీతాంజలి సభర్వాల్, టీఫైబర్ ఎండీ వేణు ప్రసాద్ సమావేశమయ్యి పరిశ్రమ ఏర్పాటుకి సంబందించిన విషయాలు చర్చించారు.  

Related Post