గోపనపల్లిలో విప్రో కంపెనీ విస్తరణకి గ్రీన్ సిగ్నల్

January 23, 2025
img

దావోస్‌ సదస్సులో తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి. ఈ సదస్సులో సిఎం రేవంత్ రెడ్డి బృందం విప్రో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌ రిషద్  ప్రేమ్ జీతో సమావేశమైనప్పుడు గచ్చిబౌలి పరిధిలో గోపనపల్లిలో విప్రో ఐటి కంపెనీని మరింత విస్తరణ చేసేందుకు ఆయన అంగీకరించారు. 

రాబోయే 2-3 ఏళ్ళలో గోపనపల్లిలో విప్రో ఐటి కంపెనీ విస్తరణ పనులు పూర్తిచేస్తామని, అవి పూర్తయితే సుమారు 5,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయని  రిషద్  ప్రేమ్ జీ చెప్పారు.

విప్రో సంస్థ ఎదుగుదలలో ఎంతగానో తోడ్పడిన హైదరాబాద్‌ నగరంతో తమకు విడదీయరాని అనుబందం ఉందని, అదిప్పుడు మరింత బలపడిందని రిషద్  ప్రేమ్ జీ అన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో విప్రో సంస్థ కూడా ఎంతగానో తోడ్పడిందని, కనుక విప్రో కంపెనీ విస్తరణకు ప్రభుత్వం తరపున ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు సిద్దంగా ఉన్నామని మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు చెప్పారు.            

Related Post