తెలంగాణకు మరో 45,000 కోట్ల పెట్టుబడులు

January 23, 2025
img

దావోస్‌ సదస్సు రెండో రోజున కూడా తెలంగాణ రాష్ట్రానికి శుభారంభం అయ్యింది. సన్ పెట్రోకెమికల్స్ కంపెనీ రాష్ట్రంలో రూ.45,000 కోట్లు పెట్టుబడి నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాలలో 3,400 మెగావాట్స్ సామర్ధ్యం కలిగిన పంపడ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.

ఇది కాక మరో 4,500 మెగావాట్స్ సామర్ధ్యం కలిగిన సోలార్ విద్యుత్ ప్లాంట్‌ ఏర్పాటు చేయబోతోంది. వీటి నిర్మాణ సమయంలో సుమారు 7,000 మందికి ఉపాధి లభిస్తుంది.

ఈ సందర్భంగా సన్ పెట్రోకెమికల్స్ కంపెనీ ఎండీ దిలీప్ సంఘ్వీ మాట్లాడుతూ, పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రం అత్యంత అనుకూలమైనది. తెలంగాణలో వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే మేము తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడితో ఈ పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాము,” అని అన్నారు. 

తెలంగాణ ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాలకు అభివృద్ధి విస్తరించాలానే మా ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. దీంతో ఆ మూడు జిల్లాలు మరింత అభివృద్ధి చెందుతాయి,” అని అన్నారు.           

Related Post