కామారెడ్డిలో ఆయిల్ పామ్ ప్లాంట్‌ ఏర్పాటుకి ఒప్పందం

January 22, 2025
img

ఆహార ఉత్పత్తులు, వాటి ప్రాసెసింగ్ రంగంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనిలివర్ సంస్థ కామారెడ్డి జిల్లాలో భారీ పెట్టుబడితో ఆయిల్ పామ్ రిఫైనరీ ప్లాంట్‌ ఏర్పాటు చేయబోతోంది. తెలంగాణలోనే మరో జిల్లాలో బాటిల్ క్యాప్స్ తయారుచేసే ప్లాంట్‌ కూడా ఏర్పాటు చేయబోతోంది. ఈ మేరకు యూనిలివర్ సీఈవో హెయిన్ షూమేకర్, చీఫ్ సప్లై ఆఫీసర్ విలియం వుయీజేన్ ఆ సంస్థ తరపున తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో ఒప్పంద పత్రాలపై దావోస్‌ సదస్సు సదస్సులో నిన్న సంతకాలు చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసింది.

దీని కోసం యూనిలివర్ కంపెనీ ఎంత పెట్టుబడి పెట్టబోతోంది.. ఎంత మందికి ఉద్యోగాలు, ఉపాధి లభించబోతున్నాయనే వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.

యూనిలివర్ కంపెనీకి అనుబందంగా హిందూస్థాన్ లివర్ కంపెనీ ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాలలో అనేక ఉత్పత్తులు తయారుచేసే ప్లాంట్స్, దేశవ్యాప్తంగా అతిభారీ మార్కెటింగ్ నెట్‌వర్క్ కూడా ఉన్న సంగతి తెలిసింది. తెలంగాణలో తొలిసారిగా ప్లాంట్స్ ఏర్పాటు చేయబోతోంది.  

Related Post