దావోస్‌ సదస్సులో తెలంగాణకు పెట్టుబడుల వరద

January 22, 2025
img

డాటా సెంటర్ వోస్‌ సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి శుభారంభం అయ్యింది. సీటిఆర్‌ఎల్‌ఎస్ డాటా సెంటర్స్ సంస్థ రూ.10,000 కోట్లు పెట్టుబడితో హైదరాబాద్‌లో 612 మెగావాట్స్ సామర్ధ్యంతో డాటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది.

ఈ మేరకు ఆ కంపెనీ సీఈవో శ్రీధర్ పినపురెడ్డితో ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయని దావోస్‌ సదస్సులో పాల్గొంటున్న మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. ఆసియాలోకెల్లా అత్యంత ఎక్కువ సామర్ధ్యం కలిగిన డాటా సెంటర్ ఇదే కాబోతోందని తెలిపారు. 

రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా అనేక ప్రాజెక్టుల నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న మేఘా ఇంజనీరింగ్ కంపెనీ రూ.11,000 కోట్లు పెట్టుబడితో 2,160 మెగావాట్స్ సామర్ధ్యం కలిగిన పంపడ్ విద్యుత్ స్టోరేజి ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. 

ఈ ప్లాంట్‌ నిర్మాణ దశలో ప్రత్యక్షంగా 1,000 మందికి, విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత 250 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ సంస్థ మరో రూ.1,000 కోట్ల పెట్టుబడితో అనంతగిరి కొండలలో ఓ రిసార్ట్ కూడా ఏర్పాటు చేయబోతోంది.  

రాకెట్స్ తయారీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ రంగంలో పేరుమోసిన స్కైరూట్ కంపెనీ రూ.500 కోట్లు పెట్టుబడితో రాష్ట్రంలో రాకెట్స్ విడిభాగాల తయారీ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 

పంపడ్ విద్యుత్ స్టోరేజిలో పేరుమోసిన సంస్థ ఎంఈఐఎల్ రూ.3,000 కోట్ల పెట్టుబడితో 1,000 మెగావాట్స్ సామర్ధ్యం కలిగిన అత్యాధునిక బ్యాటరీ విద్యుత్ స్టోరేజ్ ప్లాంట్‌ ఏర్పాటు చేయబోతోంది. దీని ద్వారా రాబోయే రెండేళ్ళలో ప్రత్యక్షంగా 1000 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 3,000 మంది ఉపాధి లభించనుంది.  

Related Post