రామగుండంలో మరో విద్యుత్ ప్లాంట్స్ మంజూరు

November 06, 2024
img

రామగుండంలో రెండో దశలో భాగంగా మరో మూడు ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు ఎన్‌టీపీసీ వెల్లడించింది. రూ.29,344.85 కోట్లు వ్యయంతో ఒక్కోటి 800 మెగావాట్స్ సామర్ధ్యం కలిగిన మూడు సూపర్ ధర్మల్ పవర్ ప్లాంట్స్ నిర్మించేందుకు తమ బోర్డు అనుమతించిందని వెల్లడించింది.

రామగుండంతో పాటు బిహార్‌లో నబీనగర్ వద్ద కూడా రెండో దశలో భాగంగా రూ.29,947.91 కోట్ల వ్యయంతో ఒక్కోటి 800 మెగావాట్స్ సామర్ధ్యం కలిగిన మూడు సూపర్ ధర్మల్ పవర్ ప్లాంట్స్ నిర్మించబోతున్నామని తెలియజేసింది. 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గడదర్వ వద్ద కూయా రూ.20,445.69 కోట్లు వ్యయంతో 2,800 మెగావాట్స్ సామర్ధ్యం కలిగిన సూపర్ ధర్మల్ పవర్ ప్లాంట్‌లో నిర్మించబోతున్నామని తెలియజేసింది.

మూడు రాష్ట్రాలలో కలిపి మొత్తం 6,400 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రూ.80,000 కోట్లు మంజూరు అయిన్నట్లు తెలిపింది.

ప్రస్తుతం ఎన్‌టీపీసీ అధ్వర్యంలో దేశం వివిద రాష్ట్రాలలో ఉన్న ధర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా 76,443 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇవికాక రిలయన్స్ వంటి అనేక ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అనేకం ఉన్నాయి. 

Related Post