హైదరాబాద్‌ మెట్రో రెండో దశ డీపీఆర్‌కి ఆమోదముద్ర

September 29, 2024
img

శంషాబాద్ విమానాశ్రయాన్ని కలుపుతూ హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్ట్ రెండో దశకి సిఎం రేవంత్‌ రెడ్డి ఆమోదం తెలిపారు. మొత్తం 116.20 కిమీ పొడవునా నిర్మించబోతున్న ఈ కారిడార్‌ నిర్మాణానికి రూ.32,237 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ని సిఎం రేవంత్‌ రెడ్డికి సమర్పించగా దానికి ఆమోదం తెలిపారు. అయితే దీనిలో కొన్ని మార్పులు చేశామని మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి చెప్పారు. 

రాజేంద్ర నగర్‌లో నిర్మితమవుతున్న కొత్త హైకోర్టుని, కొత్తగా నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీని కలుపుతూ మెట్రో అలైన్‌మెంట్‌లో అవసరమైన మార్పులు చేశామని చెప్పారు. నాగోల్-శంషాబాద్ విమానాశ్రయం మద్య నిర్మించబోతున్న 4వ కారిడార్‌లో 1.6 కిమీ మేర భూగర్భమార్గం ఉంటుందని చెప్పారు. 

Related Post