రేపటి నుంచే సికింద్రాబాద్‌-నాగ్‌పూర్ వందే భారత్‌

September 15, 2024
img

సికింద్రాబాద్‌ నుంచి విశాఖ, తిరుపతి, చెన్నై, బెంగళూరు నగరాలకు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళున్నాయి. కానీ మహారాష్ట్రని కలుపుతూ ఒక్కటి కూడా లేదు. ఆ లోటు కూడా ఇప్పుడు తీరిపోబోతోంది. సికింద్రాబాద్‌-నాగ్‌పూర్ మద్య రేపు (సోమవారం) నుంచి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను ప్రధాని నరేంద్రమోడీ రిమోట్ విధానంలో ప్రారంభించబోతున్నారు. 

ఇప్పటివరకు నడుస్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళలో అత్యధికంగా విశాఖా, తిరుపతి మార్గంలో 16 బోగీలు ఉండగా, రేపు ప్రారంభం కాబోతున్న సికింద్రాబాద్‌-నాగ్‌పూర్ మార్గంలో తిరిగే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళలో 20 బోగీలు ఉంటాయి. వాటిలో రెండు ఎగ్జిక్యూటివ్, మిగిలినవి ఛైర్మన్‌ కార్‌లో కలిపి మొత్తం 1440 సీట్లు ఉంటాయి. ఈ ట్రైన్ టికెట్ ఛార్జీలు, టైమ్ షెడ్యూల్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.  


Related Post