విజయవాడలో వరదల కారణంగా రైళ్ళు, బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలనుకునేవారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అడ్డుగోలుగా ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులను దోచుకుంటున్నాయి. ఈ పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని టిజిఎస్‌ఆర్టీసీ మంచి నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించే రాజధాని ఎక్స్‌ప్రెస్, సూపర్ డీలక్స్ బస్సు చార్జీలలో 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు ట్విట్టర్‌లో ప్రకటించింది. ఈ ఒక్క మార్గంలోనే ఈ రాయితీ ఇస్తున్నట్లు తెలియజేసింది.
ముందస్తు టికెట్స్ రిజర్వేషన్స్ కోసం www.tgsrtcbus.in అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చునని తెలియజేసింది. ఈ మార్గంలో వరద ఉదృతి క్రమంగా తగ్గుతుండటం రైలు, బస్ సర్వీసులు ప్రారంభం అయ్యాయి.
ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు ప్రయాణికులను అడ్డుగోలు చార్జీలతో దోచుకుంటున్నప్పుడు టిజిఎస్‌ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకోవడం సంస్థకు మంచి పేరుతో పాటు ఆదాయం కూడా లభిస్తుంది.