ఆదానీ గ్రూప్‌లో సెబీ ఛైర్ పర్సన్‌ భారీ పెట్టుబడులు!

August 04, 2024
img

అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసర్చ్ సంస్థ భారత్‌లో మరో భారీ కుంభకోణాన్ని బయటపెట్టింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఛైర్ పర్సన్‌ మాధవీ పూరీ, ఆమె భర్త ధావల్ బచ్ ఆదానీ గ్రూప్‌కు లబ్ధి కలిగేవిదంగా ఆ సంస్థలో భారీ పెట్టుబడులు పెట్టారని, తద్వారా ఆదానీ షేర్ వాల్యూ పెరిగేందుకు తోడ్పడ్డారని హిండెన్‌బర్గ్ రీసర్చ్ సంస్థ బాంబు పేల్చింది. 

వారిరువురూ గౌతమ్ ఆదానీ సోదరుడు వినోద్ ఆదానీ అధీనంలో ఉన్న ఆఫ్ షోర్ బెర్ముడా, మారిషస్ ఫండ్‌లలో పెట్టుబడులు పెట్టి వాటాదారులుగా ఉన్నారని వెల్లడించింది. దీనికి సంబందించి తమ వద్ద పక్కా సమాచారం ఉందని హిండెన్‌బర్గ్ రీసర్చ్ సంస్థ పేర్కొంది. 

సెబీ భారత్‌లోని క్యాపిటల్, స్టాక్ మార్కెట్ల నియంత్రణ, స్టాక్ ఎక్స్‌ఛేంజ్ నియంత్రణ, సంస్థల విలీన ప్రక్రియ, మ్యూట్యువల్ ఫండ్స్ పర్యవేక్షణ మరియు నియంత్రణ చేస్తుంది. ఇవికాక సంతల వ్యాపారాలు, పెట్టుబడులు, విలీనాలు తదితర అంశాలలో మోసాలు జరుగకుండా నియంత్రిస్తుంటుంది.

అటువంటి సంస్థకు ఛైర్ పర్సన్‌ మాధవీ పూరీ, ఆమె భర్త ధావల్ బచ్ ఆదానీ గ్రూప్‌కు లబ్ధి కలిగేవిదంగా చేసిన్నట్లు హిండెన్‌బర్గ్ రీసర్చ్ సంస్థ ప్రకటించడంతో భారత్‌ రాజకీయ, వ్యాపార, స్టాక్ మార్కెట్లలో ప్రకంపనలు మొదలయ్యాయి. దీనిపై సెబీ ఇంకా స్పందించవలసి ఉంది. 

Related Post