హైదరాబాద్‌లో మరో కొత్త రూట్‌లో బస్ సర్వీస్ షురూ

August 10, 2024
img

టిజిఎస్‌ఆర్టీసీ హైదరాబాద్‌ నగర ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వివిద మార్గాలలో సిటీ బస్ సర్వీసులను పెంచూతూనే ఉంది. తాజాగా కాజీపేట రైల్వే స్టేషన్ వద్ద నుంచి అబ్దుల్లాపూర్‌మెట్‌ మద్య 205 నంబరుతో కొత్త సిటీ బస్ సర్వీస్ ప్రారంభించింది. 

నంబర్ 205 బస్సులు కాచిగూడ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న బస్టాండ్ నుంచి బయలుదేరి జైల్ గార్డెన్, సూపర్ బజార్, దిల్‌సుక్‌నగర్‌, ద్వారకా నగర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, పనామా జంక్షన్, భాగ్యలత, హయత్ నగర్, పెద్ద అంబర్ పేట్ మీదుగా అబ్దుల్లాపూర్‌మెట్‌ చేరుకుంటాయి. మళ్ళీ అదే మార్గంలో వెనక్కు తిరిగి వస్థాయి. 

కాచిగూడ నుంచి మొదటి బస్సు ఉదయం 6.10 గంటలకు, ఆఖరి బస్సు రాత్రి 8.40 గంటలకు బయలుదేరుటాయి. అదేవిదంగా అబ్దుల్లాపూర్‌మెట్‌ నుంచి మొదటి బస్సు ఉదయం 7.20 గంటలకు, ఆఖరి బస్సు రాత్రి 9.50కి బయలుదేరుతాయి.

ఈ రెండు గమ్యస్థానాల మద్య ప్రతీ అరగంటకు ఓ బస్సు నడుస్తుందని టిజిఎస్‌ఆర్టీసీ తెలియజేసింది. కనుక నగర ప్రజలు ఈ కొత్త బస్ సర్వీసుని వినియోగించుకోవాలని కోరింది.

Related Post