సెమీడీలక్స్ బస్సులు... వీటిలో మహాలక్ష్మి ఉండదు

August 08, 2024
img

కాంగ్రెస్‌ ఎన్నికల హామీలలో మహాలక్ష్మి పధకం కూడా ఒకటి. ఈ పధకం అమలుచేస్తున్నప్పటి నుంచి టిజిఎస్‌ఆర్టీసీ ఆదాయం భారీగా పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్ధిక ఇబ్బందులలో ఉన్నందున ఎప్పటికప్పుడు ఆ నష్టపరిహారాన్ని టిజిఎస్‌ఆర్టీసీకి చెల్లించడంలో ఆలస్యమవుతోంది.

దీంతో టిజిఎస్‌ఆర్టీసీ ఇబ్బంది పడుతోంది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి టిజిఎస్‌ఆర్టీసీ కొత్తగా సెమీ డీలక్స్ బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టబోతోంది. వీటిలో మహాలక్ష్మి పధకం వర్తించదు. కనుక మహిళలు కూడా టికెట్‌ తీసుకోవలసిందే. వీటిలో కనీసం టికెట్‌ చార్జ్ రూ.30. 

ఎక్స్‌ప్రెస్‌ బస్సులలో కిలోమీటర్‌కి ఛార్జీ రూ.1.26 ఉండగా ఈ సెమీ డీలక్స్ బస్సులలో రూ.1.37 ఉండబోతోంది. ఇది కాక టోల్ గేట్ ఛార్జ్, ఇతర ఛార్జీలు కూడా ఉంటాయి. తొలి విడతలో 50 సెమీ డీలక్స్ బస్సులను ప్రవేశపెట్టబోతోంది. ఈ కొత్త బస్సులతో మహాలక్ష్మి పధకం వలన కలుగుతున్న నష్టాన్ని కొంతమేర పూడ్చుకునేందుకు టిజిఎస్‌ఆర్టీసీ ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు.

Related Post