హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్‌

August 06, 2024
img

ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న సిఎం రేవంత్‌ రెడ్డి బృందం ప్రముఖ అంతర్జాతీయ ఐ‌టి దిగ్గజం కాగ్నిజెంట్ కంపెనీతో తొలి పెట్టుబడి సాధించింది. ఆ కంపెనీ సీఈవో రవి కుమార్‌, ప్రతినిధుల బృందంతో నిన్న జరిగిన సమావేశంలో హైదరాబాద్‌లోని కాగ్నిజెంట్ కంపెనీని విస్తరించేందుకు అంగీకరించారు. గత ఏడాది సిఎం రేవంత్‌ రెడ్డి బృందం దావోస్ పర్యటనలోనే ఈ ఒప్పందం జరిగింది. ఇప్పుడు విస్తరణకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. 

తాజా విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లోనే 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కాగ్నిజెంట్ కొత్త సెంటర్‌ ఏర్పాటు చేస్తుంది. దీనిలో 15,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా కొన్ని వందల మందికి ఉపాధి లభించనున్నాయి. 

ఈ కొత్త సెంటర్‌లో ఏఐ, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ తదితర రంగాలలో దేశవిదేశాలకు సేవలు అందిస్తుందని సీఈవో రవి కుమార్‌ చెప్పారు.

ఈ రంగాలలో హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, కనుక కాగ్నిజెంట్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విదాల సహాయ సహకారాలు  అందిస్తుందని సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌ తదితర నగరాలలో ఐ‌టి కంపెనీలు నెలకొల్పేందుకు ఐ‌టి కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విదాల సాయపడుతుందని చెప్పారు.

Related Post