తెలంగాణలో గుట్కాపై నిషేధం విధించిన సర్కార్

May 26, 2024
img

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో గుట్కా తయారీ, అమ్మకాలపై నిషేధం విధించింది. ఈ నిషేదం ఏడాదిపాటు అమలులో ఉంటుందని ఉత్తర్వులలో పేర్కొంది. కనుక ఇకపై రాష్ట్రంలో గుట్కా తయారుచేసినా, పాన్ షాపులు, కిరాణా దుకాణాలు, హోటల్స్ మరెక్కడైనా గుట్కా ప్యాకెట్స్ అమ్మినా, నిలువ ఉంచినా చట్ట ప్రకారం తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఫుడ్-సేఫ్టీ అధికారులు హెచ్చరించారు.

ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి గుట్కా తీసుకువచ్చినా వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులలో వాహనాలు తనికీ చేసినప్పుడు గుట్కా ప్యాకెట్లు పట్టుబడితే అక్కడికక్కడే కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.      

హైదరాబాద్‌ నగరంలో ఇటీవల ఫుడ్-సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనికీలు నిర్వహించినప్పుడు పేరు మోసిన పెద్ద హోట ల్స్‌లో కూడా నిలువ ఉంచిన, నాసి రకమైన ఆహార పదార్ధాలను, నిషేదిత రంగులు కలిపిన ఆహార పధార్ధాలను విక్రయిస్తున్నట్లు కనుగొన్నారు.

ఆయా హోటల్స్ యజమానులకు నోటీసులు ఇచ్చి తాళం వేస్తున్నారు. ఆధునిక జీవన శైలి కారణంగా బయట తిండ్లకు అలవాటు పడిన నగర ప్రజలు ఇప్పుడు హోట ల్స్‌కు వెళ్ళాలంటే భయపడుతున్నారు. 

Related Post