ప్రతీ శుక్రవారం రాత్రి 11.45 గంటలకు ఆఖరి మెట్రో

May 25, 2024
img

హైదరాబాద్‌ మెట్రో సర్వీస్ టైమింగ్స్ గురించి ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలలో ఒక దానిని ఎల్&టి సంస్థ ధృవీకరించింది. ఇక నుంచి అన్ని మెట్రో మార్గాలలో ప్రతీ శుక్రవారం రాత్రి 11.45 గంటలకు ఆఖరి మెట్రో రైలు బయలుదేరుతాయని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

శని, ఆదివారాలు వారాంతపు సెలవులు ఎంజాయ్ చేసే వారు ఇకపై హాయిగా ఈ ఆఖరి మెట్రో సర్వీసులను ఉపయోగించుకొని గమ్యస్థానాలు చేరుకోవవచ్చని తెలియజేసింది. 

సాధారణంగా ప్రతీ సోమవారం ఉదయం పూట ఉద్యోగులతో మెట్రో రైళ్ళు కిటకిటలాడుతుంటాయి. కనుక సోమవారం ఉదయం 5.30 గంటల నుంచే మెట్రో రైల్ సర్వీసులు ప్రారంభించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ప్రతిపాదనని కూడా పరిశీలిస్తున్నామని మెట్రో అధికారులు తెలిపారు. 

ప్రతీరోజూ మెట్రో రైల్ సర్వీసులు ముగిసిన తర్వాత మర్నాడు ఉదయంలోగా అన్ని కోచ్‌లను శుభ్రపరచడం, అన్ని మార్గాలలో ట్రాకులను పరిశీలించి అవసరమైన మరమత్తులు చేస్తుండటం వంటి పనులు చేస్తుంటారు.

కనుక అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని వీలైతే సోమవారం ఉదయం 5.30 గంటల నుంచి అన్ని మార్గాలలో మెట్రో రైళ్ళు నడిపించే ఆలోచన చేస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి శుక్రవారం రాత్రి 11.45 గంటలకు ఆఖరి సర్వేస్ నడిపించబోతున్నామని తెలిపారు. 


Related Post