సిటీ బస్సులలో చిల్లర సమస్యలు ఇక ఉండవు

September 30, 2023
img

సిటీ బస్సులలో ప్రయాణికులు, కండక్టర్లు తరచూ చిల్లర కోసం గొడవ పడుతుంటారు. ఇకపై ఆ సమస్య లేకుండా సిటీ బస్సులలో కూడా యూపీఐ ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేసి టికెట్ కొనుగోలు చేయవచ్చు.

ఇప్పటికే అంతర్ జిల్లా బస్ సర్వీసులు, మెట్రో లగ్జరీ, ఏసీ బస్సులలో ఈ విధానం విజయవంతంగా అమలుచేస్తున్నారు. కనుక ఇక నుంచి హైదరాబాద్‌ నగరంలో తిరుగుతున్న అన్ని రకాల సిటీ బస్సులలో ఈ విధానం ప్రవేశపెట్టబోతున్నట్లు టిఎస్‌ఆర్టీసీ ప్రకటించింది.

యూపీఐ విధానంలో డిజిటల్ పేమెంట్స్ కోసం టిఎస్‌ఆర్టీసీ ఐ-టీమ్స్ మెషిన్లను కండక్టర్లకు అందించబోతోంది. ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలోని పేమెంట్స్ యాప్స్ ద్వారా పేమెంట్ చేసి  టికెట్ పొందవచ్చు. కనుక జేబులో పైసా లేకున్నా మొబైల్ ఫోన్ ఉంటే చాలు నిర్భయంగా ఏ బస్సైనా ఎక్కేయవచ్చు.

గత కొన్నేళ్ళుగా దాదాపు ప్రజలందరికీ కూడా యూపిఐ విధానంలో డిజిటల్ పేమెంట్స్ చేయడం బాగానే అలవాటుపడ్డారు. కనుక సిటీ బస్సులలో ఈ విధానం వస్తే అందరికీ సంతోషమే.

Related Post