తెలంగాణలో సింటెక్స్ 350 కోట్లు పెట్టుబడి

September 24, 2023
img

వెల్‌స్పన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో భాగస్వామిగా ఉన్న ప్రముఖ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ తయారీ సంస్థ సింటెక్స్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టబోతోందని రాష్ట్ర ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ తెలియజేశారు. సింటెక్స్ కంపెనీ రూ.350 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా చందన్వల్లి వద్ద నీళ్ళ ట్యాంకులు, ప్లాస్టిక్ పైపులు, వాహన రంగానికి సంబందించిన ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఈ సంస్థ ద్వారా దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. 

ఈ నెల 28న అవసరమైన చందన్వల్లి వద్ద సింటెక్స్ కంపెనీకి శంకుస్థాపన జరుగుతుంది. ఈ కార్యక్రమానికి  వెల్‌స్పన్ గ్రూప్ అధినేత బీకె గోయాంకా తదితరులు హాజరవుతారని మంత్రి కేటీఆర్‌ తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిశ్రమ స్థాపించేందుకు ముందుకు వచ్చినందుకు మంత్రి కేటీఆర్‌ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని తెలియజేసేందుకు ఇది మరో ఉదాహరణ అని అన్నారు. 


Related Post