కాచిగూడ-బెంగళూరు వందే భారత్‌ టైమింగ్స్, టికెట్ ఛార్జీలు

September 23, 2023
img

ప్రధాని నరేంద్రమోడీ రేపు (ఆదివారం) కాచిగూడ-యశ్వంత్ పూర్ (బెంగళూరు) మద్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్ సర్వీసుని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. సోమవారం నుంచి ఈ రైళ్ళు ప్రజలకు అందుబాటులోకి రానున్న నేపధ్యంలో దక్షిణమద్య రైల్వే ఈ సర్వీసుల టైమింగ్స్, టికెట్ చార్జీలను ప్రకటించింది. 

కాచిగూడ- యశ్వంత్ పూర్ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ నంబర్: 20703. ఇది బుధవారం తప్ప మిగిలిన ఆరు రోజులు ప్రయాణిస్తుంది. ప్రతీరోజు ఉదయం 5.30 గంటలకు కాచిగూడ స్టేషన్‌లో బయలుదేరి మహబూబ్ నగర్‌ (6.49), కర్నూలు సిటీ (8.24), అనంతపురం (10.44), ధర్మవరం జంక్షన్ (11.14) మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్ పూర్ చేరుతుంది. 

కేటరింగ్ ఛార్జీలు కూడా కలిపి చైర్ కార్ టికెట్ ఛార్జి: రూ.1,600, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఛార్జీ: రూ.2,915గా నిర్ణయించారు.  

యశ్వంత్ పూర్-కాచిగూడా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రెయిన్ నంబర్: 20704. ఇది మధ్యాహ్నం 2.45గంటలకు యశ్వంత్ పూర్ నుంచి బయలుదేరి ధర్మవరం జంక్షన్ (సాయంత్రం 4.59), అనంతపురం (5.29), కర్నూలు సిటీ (7.50), మహబూబ్ నగర్‌ (9.34) మీదుగా కాచిగూడ స్టేషన్‌కు రాత్రి 11.15 గంటలకు చేరుకొంటుంది.        

కేటరింగ్ ఛార్జీలు కూడా కలిపి చైర్ కార్ టికెట్ ఛార్జి: రూ.1,540, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఛార్జీ: రూ.2,865గా నిర్ణయించారు. 

రేపే విజయవాడ-చెన్నై మద్య కూడా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సర్వీసును ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించబోతున్నారు. ఈ మార్గంలో మంగళవారం తప్ప మిగిలిన ఆరు రోజులు ఈ రైళ్లు నడుస్తాయి. చెన్నై-విజయవాడ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రెయిన్ నంబర్: 20677. ఇది చెన్నై నుంచి ఉదయం 6.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటలకు విజయవాడ చేరుకొంటుంది. 

విజయవాడ నుంచి చెన్నై వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రెయిన్ నంబర్: 20678. ఇది విజయవాడ నుంచి మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు చెన్నై చేరుకొంటుంది.  


Related Post